ట్విట్టర్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోండిలా!
గొప్ప గొప్ప వాళ్ల అధికారిక ట్విట్టర్ ఖాతాలే హ్యాక్ అవుతుండటంతో సాధారణ ప్రజలు, ఇతర సెలబ్రిటీలు.. వారి ఖాతాల గురించి బెంగపడుతున్నారు. ట్విట్టర్ సెక్యూరిటీ ఇంత వీక్ ఉందా? అని సందేహపడుతున్నారు. కానీ వీళ్లందరూ ఇప్పటికప్పుడు ట్విట్టర్‌ను డిలీట్ చేయలేరు కదా.. కానీ వినియోగదారుని వైపు సెక్యూరిటీని పెంచుకోగలిగితే ఎంత కొంత హ్యాక్‌ను అడ్డుకునే అవకాశం కలుగుతుంది. అయినా పెద్ద పెద్ద వాళ్ల ఖతాలు హ్యాక్ చేస్తారు గానీ, మనదెందుకు చేస్తారని తేలికగా తీసుకోకండి. ట్విట్టర్ బిట్‌కాయిన్ […]
గొప్ప గొప్ప వాళ్ల అధికారిక ట్విట్టర్ ఖాతాలే హ్యాక్ అవుతుండటంతో సాధారణ ప్రజలు, ఇతర సెలబ్రిటీలు.. వారి ఖాతాల గురించి బెంగపడుతున్నారు. ట్విట్టర్ సెక్యూరిటీ ఇంత వీక్ ఉందా? అని సందేహపడుతున్నారు. కానీ వీళ్లందరూ ఇప్పటికప్పుడు ట్విట్టర్‌ను డిలీట్ చేయలేరు కదా.. కానీ వినియోగదారుని వైపు సెక్యూరిటీని పెంచుకోగలిగితే ఎంత కొంత హ్యాక్‌ను అడ్డుకునే అవకాశం కలుగుతుంది. అయినా పెద్ద పెద్ద వాళ్ల ఖతాలు హ్యాక్ చేస్తారు గానీ, మనదెందుకు చేస్తారని తేలికగా తీసుకోకండి. ట్విట్టర్ బిట్‌కాయిన్ హ్యాక్‌లో దిగ్గజాల ఖాతాలతో పాటు పది మంది ఫాలోవర్లు కూడా లేని ఖాతాలు కూడా చాలా ఉన్నాయని గుర్తుపెట్టుకుని మీ ఖాతాను రక్షించడానికి ఈ విధానాలు పాటించండి.
టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్
బిట్‌కాయిన్ హ్యాక్ లాంటి దాడిని ఈ టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తట్టుకోలేకపోవచ్చు. కానీ ప్రాథమిక సెక్యూరిటీని అందజేయడంలో ఈ అథెంటికేషన్ తప్పనిసరి. ఇది ఆన్ చేసుకున్న తర్వాత హ్యాకర్‌కు ఇబ్బంది రెండింతలు అవుతుంది. అంటే మీ ఖాతాను హ్యాక్ చేయడానికి హ్యాకర్ రెండు దశలు దాటాలన్నమాట. ట్విట్టర్‌లో అంతర్గత యాక్సెస్ లేకుండా ఈ టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్ దాటడం చాలా కష్టం.
అన్‌ఫాలో, బ్లాక్
ట్విట్టర్‌లో ఎవరైనా మీ అనుమతి లేకుండా మీ యాక్టివిటీ గమనిస్తున్నారనిపించినా లేదా మీకు ప్రత్యక్షంగా ఇబ్బందులు కలిగిస్తున్నా.. అలాంటి వారిని అన్‌ఫాలో లేదా బ్లాక్ చేయండి. తద్వారా వారి బారి నుంచి హ్యాకింగ్ యత్నాన్ని అడ్డుకునే అవకాశం దొరుకుతుంది.
అంతేకాకుండా డైరెక్టు మెసేజ్‌లను ఆఫ్ చేసుకోవడం, మీ ఖాతాను ప్రైవేటుగా పెట్టుకోవడం ద్వారా కూడా మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే మీకు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి ట్వీటును, ప్రతి ప్రకటనను ఎప్పటికప్పుడు రిపోర్టు చేయడం ద్వారా కూడా అనుమానిత ఖాతాలను ట్విట్టర్ సెక్యూరిటీకి తెలిసేలా చేయవచ్చు.