ఏడాది చివరి వరకు సవాళ్లు తప్పవు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ సవాళ్లు తప్పవని టీవీఎస్ మోటార్ కంపెనీ అభిప్రాయపడింది. 2019-20 వార్షిక నివేదికలో పేర్కొన్నట్లుగా ఈ ఏడాది చివరికి కొంత ఉపశమనం ఆశిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. వ్యవసాయ రంగంలో వృద్ధి పెరిగితేనే కొంతవరకు ద్విచక్ర వాహనాల పరిశ్రమ మెరుగుపడుతుందని కంపెనీ పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కొవిడ్-19 ప్రభావం, ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కారణంగా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని టీవీఎస్ మోటార్ […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ సవాళ్లు తప్పవని టీవీఎస్ మోటార్ కంపెనీ అభిప్రాయపడింది. 2019-20 వార్షిక నివేదికలో పేర్కొన్నట్లుగా ఈ ఏడాది చివరికి కొంత ఉపశమనం ఆశిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. వ్యవసాయ రంగంలో వృద్ధి పెరిగితేనే కొంతవరకు ద్విచక్ర వాహనాల పరిశ్రమ మెరుగుపడుతుందని కంపెనీ పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కొవిడ్-19 ప్రభావం, ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కారణంగా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని టీవీఎస్ మోటార్ కంపెనీలు వెల్లడించింది. అన్ని రంగాలపై ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీడీపీ, పునర్వినియోగంలేని ఆదాయం, వినియోగదారుల సెంటిమెంట్‌పై ప్రభావం అధికంగా ఉందని కంపెనీ తెలిపింది. పర్యావసానంగా, 2020-21లో తొలి త్రైమాసికంలో ప్రతికూల క్షీణత ఉందని, రెండో త్రైమాసికంలో కొంత ఉపశమనం ఉండవచ్చునని కంపెనీ భావిస్తోంది. ఏదేమైనా పరిశ్రమ సాధారణ స్థితికి రావడానికి సంవత్సరం చివరి వరకూ ఆగాలని కంపెనీ పేర్కొంది. ఉద్యోగాలు పోవడం, జీతాల్లో కోత లాంటి ఊహించని సంఘటనల వల్లే వినియోగదారులు నగదు భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారని టీవీఎస్ కంపెనీ తెలిపింది. ఇది ఆటోమొబైల్ సహా పలు రంగాలు ప్రతికూల స్థితి. ఖర్చు తగ్గింపులను, మూలధన నిర్వహణపై దృష్టి సారించాలని డీలర్లు, సరఫరాదారులకు సూచిస్తున్నట్టు టీవీఎస్ కంపెనీ వివరించింది.