జర్నలిస్టులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో..
దిశ, హైదరాబాద్: హెల్త్ కార్డులు ఉన్న జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత కరోనా వైద్య సేవలందించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) డిమాండ్ చేసింది. సోమవారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు మాట్లాడుతూ.. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ఒకరైన జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించేలా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించడం మంచి పరిణామం అన్నారు. అలాగే ప్రభుత్వం అనుమతించిన అన్ని […]
దిశ, హైదరాబాద్: హెల్త్ కార్డులు ఉన్న జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత కరోనా వైద్య సేవలందించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) డిమాండ్ చేసింది. సోమవారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు మాట్లాడుతూ.. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ఒకరైన జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించేలా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించడం మంచి పరిణామం అన్నారు. అలాగే ప్రభుత్వం అనుమతించిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.