ఈటలకు అండగా తుల ఉమ..?
దిశ, హుజురాబాద్: ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకురాలిగా ఉన్న ఆమె నిజామాబాద్ జిల్లా ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఉమ ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి కలిశారు. ఈటలతో సుమారు 30 నిమిషాల సేపు ముచ్చటించి తుల ఉమ ఆ తరువాత వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కమలాపూర్ […]
దిశ, హుజురాబాద్: ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకురాలిగా ఉన్న ఆమె నిజామాబాద్ జిల్లా ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఉమ ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి కలిశారు. ఈటలతో సుమారు 30 నిమిషాల సేపు ముచ్చటించి తుల ఉమ ఆ తరువాత వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కమలాపూర్ మండలలానికి చెందిన ఈటల అనుచరులు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజేందర్ ను నేను కలవలేదు…
అయితే తాను ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లింది వాస్తవమేనని అయితే తాను ఆయన్ని మాత్రం కలవలేదని తుల ఉమ ’దిశ‘కు వివరించారు. ‘రాజేందర్ గారి భార్యతో తనకు ఉన్న వ్యక్తిగత పరిచయంతోనే వెళ్లానే తప్ప రాజకీయ పరిణామాల గురించి మాత్రం కాదని’ స్పష్టం చేశారు.