నిర్ణయానికి ముందు గురువులను సంప్రదించాలి…

దిశ వెబ్ డెస్క్: టీటీడీ ఆర్థిక అంశాలను కాగ్ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ఆహ్వానించదగినదని స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. రిషికేష్ లో విశాఖ శారద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర,స్వాత్మానందేంద్రలను టీటీడీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను టీటీడీ ప్రతినిధులు అందజేశారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, జేఈవో ధర్మారెడ్డి స్వామిజీలు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గుడికో గోవు మంచి కార్యక్రమమనీ, దీన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. […]

Update: 2020-09-06 08:03 GMT

దిశ వెబ్ డెస్క్: టీటీడీ ఆర్థిక అంశాలను కాగ్ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ఆహ్వానించదగినదని స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. రిషికేష్ లో విశాఖ శారద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర,స్వాత్మానందేంద్రలను టీటీడీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను టీటీడీ ప్రతినిధులు అందజేశారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, జేఈవో ధర్మారెడ్డి స్వామిజీలు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గుడికో గోవు మంచి కార్యక్రమమనీ, దీన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. టీటీడీ ధార్మిక నిర్ణయాలకు ముందు సాంప్రదాయ గురువులను సంప్రదించాలన్నారు.

Tags:    

Similar News