కరోనాతో టీటీడీ మాజీ ప్రధానార్చకులు మృతి

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20 ఏళ్లకు పైగా శ్రీనివాసమూర్తి దీక్షితులు శ్రీవారి సేవలో తరించారు. ఈ మధ్యే ఆయన కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసమూర్తి దీక్షితులు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. సుదీర్ఘ సేవలందించిన దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్దతిలో వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఆయన కరోనా బారిన […]

Update: 2020-07-19 22:38 GMT

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20 ఏళ్లకు పైగా శ్రీనివాసమూర్తి దీక్షితులు శ్రీవారి సేవలో తరించారు. ఈ మధ్యే ఆయన కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసమూర్తి దీక్షితులు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. సుదీర్ఘ సేవలందించిన దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్దతిలో వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. దీంతో సంప్రదాయ అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడింది.

Tags:    

Similar News