ఇక్కడే పెద్ద ట్విస్ట్.. స్వామికి శిష్యులే వైద్యులు
దిశ, ఏపీ బ్యూరో: విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు శుశ్రూషలు చెయ్యడం శిష్యుల బాధ్యత.. ప్రధానంగా మఠాల్లో ఈ సంప్రదాయం తరాలుగా వారసత్వంగా వస్తోంది. కరోనా సోకిన గురువుకి సేవలందించేందుకు శిష్యులే ముందుకు వచ్చిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే… తిరుమల ఆలయ పెద్ద జీయంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను చికిత్స నిమిత్తం చెన్నై అపోలోకు తరలించాలని తొలుత టీటీడీ అధికారులు భావించారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ […]
దిశ, ఏపీ బ్యూరో: విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు శుశ్రూషలు చెయ్యడం శిష్యుల బాధ్యత.. ప్రధానంగా మఠాల్లో ఈ సంప్రదాయం తరాలుగా వారసత్వంగా వస్తోంది. కరోనా సోకిన గురువుకి సేవలందించేందుకు శిష్యులే ముందుకు వచ్చిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే… తిరుమల ఆలయ పెద్ద జీయంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను చికిత్స నిమిత్తం చెన్నై అపోలోకు తరలించాలని తొలుత టీటీడీ అధికారులు భావించారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఒకటి వెలుగు చూసింది. ఈ నెల 5వ తేదీన పెద్ద జీయర్.. చాతుర్మాస దీక్ష తీసుకున్నారు. దీక్షలో ఉన్న సమయంలో దీక్షా పరులు ఊరి పొలిమేరలు దాటకూడదన్న నిబంధన ఉంది. ఆరోగ్య రీత్యా ఈ ఉదయం పద్మావతి కోవిడ్ సెంటర్‌కు టీటీడీ అధికారులు తరలించారు. దీక్షలో ఉండడంతో తిరిగి మరికాసేపట్లో జీయర్‌ను పెద్ద జీయర్ మఠానికి వైద్యులు తరలించనున్నారు. మఠంలోనే జీయర్‌కు వైద్యం అందించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కాగా జీయర్‌కు స్వయంగా సేవలు అందించేందుకు శిష్య బృందం ముందుకు వచ్చింది.