నేటికి సరిగ్గా నెల.. ఆదాయం 13.93 కోట్లు
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తరువాత తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను పునరుద్ధరించి నేటికి నెల రోజులు ముగిసింది. ఈ నెల రోజుల్లో తిరుమల శ్రీవారిని 2 లక్షల 49 వేల 369 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది. వీరిలో 66708 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నెల రోజుల్లో శ్రీవారి హుండీ ద్వారా రూ.13.93 కోట్ల ఆదాయం లభించిందని తెలిపింది.