కరోనా టీటీడీ ప్రధాన అర్చకుడు మృతి..
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసులతోపాటు, మరణాల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో విజృంభిస్తూ, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ, కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఆ అర్చకుడు కొద్ది రోజుల క్రిత్తమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డిప్యూటేషన్‌పై తిరుమలకు వచ్చారు. అర్చకుడికి వారం క్రితం కరోనా నిర్ధారణ కావడంతో […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసులతోపాటు, మరణాల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో విజృంభిస్తూ, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ, కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే.
కాగా ఆ అర్చకుడు కొద్ది రోజుల క్రిత్తమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డిప్యూటేషన్‌పై తిరుమలకు వచ్చారు. అర్చకుడికి వారం క్రితం కరోనా నిర్ధారణ కావడంతో వైద్యం కోసం టీటీడీ స్విమ్స్‌కు తరలించారు. ఆయన స్విమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందారు. అర్చకుడు మృతి చెందడంతో టీటీడీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల ప్రధాన అర్చకుడిగా శ్రీనివాసమూర్తి దాదాపు 20ఏళ్లకు పైగా పని చేశారు.