శబరిమలకు వెళ్లే భక్తులకు TSRTC గుడ్ న్యూస్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు అద్దె ప్రాతిపదికన ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​ ప్రకటించారు. దీనికోసం 200 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ఒక గురుస్వామితో పాటుగా ఇద్దరు వంటవాళ్లు, ఇద్దరు మణికంఠలు, ఒక అటెండర్​కు ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అదేవిధంగా శబరిమల యాత్రికులకు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్​ లేకుండా అద్దెకు బస్సులు ఇస్తామని నిర్ణయం తీసుకున్నట్లు సజ్జనార్​ వెల్లడించారు. అయితే […]

Update: 2021-12-13 10:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు అద్దె ప్రాతిపదికన ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​ ప్రకటించారు. దీనికోసం 200 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ఒక గురుస్వామితో పాటుగా ఇద్దరు వంటవాళ్లు, ఇద్దరు మణికంఠలు, ఒక అటెండర్​కు ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అదేవిధంగా శబరిమల యాత్రికులకు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్​ లేకుండా అద్దెకు బస్సులు ఇస్తామని నిర్ణయం తీసుకున్నట్లు సజ్జనార్​ వెల్లడించారు.

అయితే శబరిమలకు బుక్​ చేసుకున్న అద్దె బస్సులను రద్దు చేసుకుంటే ప్రత్యేక చార్జీలు విధించినట్లు ప్రకటించారు. ప్రయాణ సమయానికి 48 గంటల కంటే ముందు రద్దు చేసుకుంటే రూ. 1000 ఉంటుందని, అదే విధంగా 24 గంటల నుంచి 48 గంటల ముందు వరకు రద్దు చేసుకుంటే రూ. 5వేలు, 24 గంటల ముందు నుంచి బస్సు బయలుదేరే సమయానికి రద్దు చేసుకుంటే రూ. 10 వేలు చెల్లించాలని సూచించారు. టీఎస్​ ఆర్టీసీ కేరళ రాష్ట్ర అధికారులతో చర్చించిందని, పంబా దగ్గర స్పాట్​ బుకింగ్​ ద్వారా బస్సులోని భక్తులందరికీ ఒకేసారి ఎలాంటి అవాంతరాలు లేకుండా దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని సజ్జనార్​ వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాల కోసం కాల్​ సెంటర్​ను ఏర్పాటు చేశామని, కాల్​ సెంటర్​ 040– 30102829ని సంప్రదించాలని కోరారు.

Tags:    

Similar News