ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నదాల్ ఔట్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో బుధవారం సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్ 2, స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ క్వార్టర్ ఫైనల్‌లోనే వెనుదిరిగాడు. రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన నదాల్ క్వార్టర్స్‌లోనే వెనుదిరగడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. క్వార్టర్ ఫైనల్లో స్టెఫానోస్ సిట్సిపాస్ చేతిలో 6-3, 6-2, 6-7 (4), 4-6, 5-7 తేడాతో ఓడిపోయాడు. తొలి రెండు సెట్లను గెలిచి ఆధిపత్యం సాధించిన నదాల్.. ఆ తర్వాత ఆటపై పట్టు […]
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో బుధవారం సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్ 2, స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ క్వార్టర్ ఫైనల్‌లోనే వెనుదిరిగాడు. రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన నదాల్ క్వార్టర్స్‌లోనే వెనుదిరగడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. క్వార్టర్ ఫైనల్లో స్టెఫానోస్ సిట్సిపాస్ చేతిలో 6-3, 6-2, 6-7 (4), 4-6, 5-7 తేడాతో ఓడిపోయాడు. తొలి రెండు సెట్లను గెలిచి ఆధిపత్యం సాధించిన నదాల్.. ఆ తర్వాత ఆటపై పట్టు కోల్పోయాడు. రెండు సెట్లు గెలిచి ఆ తర్వాత మ్యాచ్ ఓడిపోవడం నదాల్ కెరీర్‌లో ఇది మూడో సారి మాత్రమే. గతంలో మియామీ ఓపెన్ 2005లో ఫెదరర్‌పై, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2015లో ఫోగ్నినిపై ఓడిపోయాడు. ఫెదరర్‌పై గెలుపొందిన సిట్సిపాస్ శుక్రవారం జరిగే సెమీస్‌లో డానిల్ మెద్వెదేవ్‌తో తలపడనున్నాడు.
మహిళల సింగిల్స్ వరల్ నెంబర్ 1 ఆష్ బార్టీ 25వ సీడ్ కరోలినా ముచోవాపై ఓడిపోయింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 6-1, 3-6, 2-6 తేడాతో బార్టీ ఓడిపోయి తన ఆస్ట్రేలియన్ ఓపెన్ కలను తీర్చుకోకుండా నిష్క్రమించింది. గురువారం జరగనున్న మహిళల సెమీస్‌లో సెరేనా విలియమ్స్‌తో నయోమీ ఒసాక, జెన్నిఫర్ బార్డీతో కరోలినా ముచోవా తలపడనున్నారు.