వేతనాల్లో కోతలొద్దు: టీఎస్ మెసా

దిశ, హైదరాబాద్: కోతలు లేకుండా ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనాలు చెల్లించాలని తెలంగాణ స్టేట్ మెనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎస్ మెసా వ్యవస్థాపక అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మంగళవారం కేసీఆర్‌ను కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫారూఖ్ అహ్మద్ మాట్లాడుతూ.. కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి ఉద్యోగుల వేతనాలలో కోతలు విధిస్తుండడంతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నట్లు […]

Update: 2020-06-23 08:34 GMT

దిశ, హైదరాబాద్: కోతలు లేకుండా ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనాలు చెల్లించాలని తెలంగాణ స్టేట్ మెనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎస్ మెసా వ్యవస్థాపక అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మంగళవారం కేసీఆర్‌ను కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫారూఖ్ అహ్మద్ మాట్లాడుతూ.. కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి ఉద్యోగుల వేతనాలలో కోతలు విధిస్తుండడంతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గృహాలు, వాహనాలు తదితర కొనుగోలు నిమిత్తం రుణాలు తీసుకున్నవారు సకాలంలో చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జులై 1వ తేదీన ఇచ్చే జూన్ మాస వేతనాలు కోతలు లేకుండా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News