కేటీఆర్ బర్త్ డే .. ఆ ఛాలెంజ్ పూర్తిచేసిన టీఎస్ ఐఐసి చైర్మన్

దిశ,మునుగోడు: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు,మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 45వ పుట్టిన రోజు సందర్భంగా టీఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చేపట్టిన ముక్కోటి వృక్షార్చాన కార్యక్రమంలో  భాగంగా శనివారం చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో టీఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు మొక్కలు నాటారు. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఐఎఫ్) అధ్యక్షుడు కే సుధీర్ […]

Update: 2021-07-24 04:38 GMT

దిశ,మునుగోడు: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు,మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 45వ పుట్టిన రోజు సందర్భంగా టీఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చేపట్టిన ముక్కోటి వృక్షార్చాన కార్యక్రమంలో భాగంగా శనివారం చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో టీఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు మొక్కలు నాటారు. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఐఎఫ్) అధ్యక్షుడు కే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి లో పాల్గొని మొక్కలు నాటారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ.. “రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తన జన్మదిన సందర్భంగా హంగులు ఆర్భాటాలకు పోకుండా మొక్కలు నాటాలని కేటీఆర్ కూడా పిలుపునివ్వడం సంతోషకరమని అన్నారు. అంతేకాకుండా ప్రతి సందర్భాన్ని ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి టీఎస్ ఐఐసి జోనల్ మేనేజర్ శారద, తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య కార్యదర్శి గోపాలరావు, ఇతర ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Full View

Tags:    

Similar News