సినిమా టికెట్ల ధరలు ఎలా పెంచుతున్నారు.. రూల్స్ చెప్పండి: హైకోర్టు
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా థియేటర్లు టిక్కెట్ల ధరలను పెంచడంపై ప్రభుత్వం రూపొందించిన విధానాలేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వం ఫ్రేమ్ చేసిన రూల్స్ ను నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. టికెట్ల ధరల పెంపుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించిన బెంచ్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. టికెట్ ధరలను పెంచాలనే నిర్ణయం ప్రభుత్వానిది కాదని, దీన్ని ఖరారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా థియేటర్లు టిక్కెట్ల ధరలను పెంచడంపై ప్రభుత్వం రూపొందించిన విధానాలేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వం ఫ్రేమ్ చేసిన రూల్స్ ను నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. టికెట్ల ధరల పెంపుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించిన బెంచ్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. టికెట్ ధరలను పెంచాలనే నిర్ణయం ప్రభుత్వానిది కాదని, దీన్ని ఖరారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆ కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు.
కమిటీ సూచనలపై ప్రభుత్వ నిర్ణయాన్ని నాలుగు వారాల్లోకి కోర్టుకు తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని బెంచ్ ఆదేశించింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ కార్యదర్శి, హోం కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.