జూన్ విద్యుత్ సబ్సిడీలకు రూ.833కోట్లు
దిశ, న్యూస్‌బ్యూరో : వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలు, నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ బిల్లులకుగాను రూ.833కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా శుక్రవారం జీవో జారీ చేశారు. జూన్ నెలలో వ్యవసాయ కనెక్షన్‌లకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలు, నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ బిల్లులకు అయ్యే ఖర్చుకుగాను ఈ సొమ్ము విడుదల చేస్తున్నట్టు […]
దిశ, న్యూస్‌బ్యూరో : వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలు, నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ బిల్లులకుగాను రూ.833కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా శుక్రవారం జీవో జారీ చేశారు. జూన్ నెలలో వ్యవసాయ కనెక్షన్‌లకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలు, నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ బిల్లులకు అయ్యే ఖర్చుకుగాను ఈ సొమ్ము విడుదల చేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు.వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.10,400 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.