తెలంగాణ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. రుణాలు ఇప్పించేందుకు సర్కార్ సై

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ రుణాల బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై ఉద్యోగ సంఘాలు సోమవారం సీఎస్​ సోమేశ్​కుమార్​తో బీఆర్కే భవన్​లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాలుగు ప్రధానాంశాలపై చర్చించారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంతమందికి కరోనా సోకడంతో ఇబ్బందులు వచ్చాయని ఈ సందర్భంగా […]

Update: 2021-07-05 04:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ రుణాల బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై ఉద్యోగ సంఘాలు సోమవారం సీఎస్​ సోమేశ్​కుమార్​తో బీఆర్కే భవన్​లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాలుగు ప్రధానాంశాలపై చర్చించారు.

కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంతమందికి కరోనా సోకడంతో ఇబ్బందులు వచ్చాయని ఈ సందర్భంగా వివరించారు. దీనికోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పటించేందుకు అంగీకరించారు. అయితే బ్యాంకులు కొన్నిచోట్ల ఉద్యోగులకు లోన్లు ఇచ్చేందుకు సతాయిస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికోసం జిల్లా కలెక్టర్లకు స్పెషల్​ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు సీఎస్​ వెల్లడించారు. ఉద్యోగులకు సంబంధించిన రుణాలు ఇప్పించేందుకు కలెక్టర్లు… బ్యాంకర్లతో సమావేశమవుతారన్నారు. అదే విధంగా కరోనా కాలంలో ఉద్యోగులకు వాహన రుణాలు ఇప్పించేందుకు కూడా అనుమతిచ్చారు. బస్సులు, ప్రైవేట్​ వాహనాల్లో వచ్చేవారికి కరోనా సోకుతుందనే కారణాల నేపథ్యంలో వారికి వాహనాల కోసం రుణాలివ్వనున్నారు.

క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​

ఇక ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్​ చేస్తున్న క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​కు ప్రభుత్వం తరపున అంగీకరించారు. ఉద్యోగుల మూల వేతనం నుంచి 1 శాతం వేతనాన్ని మినహాయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు త్వరలోనే అనుమతిస్తామని ఉద్యోగ సంఘాలకు సీఎస్​ హామీ ఇచ్చారు. ఏపీలో పని చేస్తున్న మిగిలిన ఉద్యోగులను త్వరలోనే రాష్ట్రానికి తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

సీఎస్​తో సమావేశమైన వారిలో టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్​, రాయకంటి ప్రతాప్​, టీజీఓ అధ్యక్ష, కార్యదర్శులు మమత, ఏనుగుల సత్యనారాయణ, ప్రతినిధులు రవీంద్ర కుమార్​, గండూరి వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణ యాదవ్​, ముజీబ్​, లక్ష్మణ్​ గౌడ్​ తదితరులున్నారు.

Tags:    

Similar News