RTO వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయండి..

దిశ, ఖైరతాబాద్ : అవినీతికి పాల్పడుతూ ఆటో డ్రైవర్లను వేధింపులకు గురిచేస్తున్న రవాణా శాఖ అధికారి వెంకటేశ్వర రావును తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో‌ రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.‌ సుమారు 100 మంది ఆటో డ్రైవర్లు ‌ వెంకటేశ్వరావు అవినీతికి అడ్డుకట్ట వేయాలంటూ నినాదాలు చేశారు. ఆర్టీవో కార్యాలయాల్లో అవినీతి తాండవిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి వేలాది […]

Update: 2021-11-16 03:14 GMT

దిశ, ఖైరతాబాద్ : అవినీతికి పాల్పడుతూ ఆటో డ్రైవర్లను వేధింపులకు గురిచేస్తున్న రవాణా శాఖ అధికారి వెంకటేశ్వర రావును తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో‌ రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.‌ సుమారు 100 మంది ఆటో డ్రైవర్లు ‌ వెంకటేశ్వరావు అవినీతికి అడ్డుకట్ట వేయాలంటూ నినాదాలు చేశారు.

ఆర్టీవో కార్యాలయాల్లో అవినీతి తాండవిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూనే కడు దయనీయ పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్న ఆటోడ్రైవర్లు, వాహనదారుల నుంచి లంచాలు గుంజుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాల్లో అవినీతికి కారణం ఆయనే అంటూ నినాదాలు చేశారు. కాగా, రవాణా శాఖ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News