కారు దహనం కేసులో అసలు నిజాలు 

దిశ, వెబ్ డెస్క్: బెజవాడ నోవాటెల్ హోటల్ వద్ద సోమవారం కారుపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బుల వ్యవహారమే హత్యాయత్నానికి ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. ఏడాది క్రితం నాగమణి-గంగాధర్ దంపతులు, కృష్ణారెడ్డిలకు వేణుగోపాల్‌ రెడ్డి అనే వ్యక్తి రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చాడు. అయితే అప్పుగా తీసుకున్న సొమ్మును ఇవ్వకుండా నాగమణి-గంగాధర్ దంపతులు, కృష్ణారెడ్డి కాలం వెళ్లుబుచ్చుతున్నారు. ఫైనాన్స్ వ్యవహారం సెటిల్ మెంట్ చేసుకుందామని వారిని వేణుగోపాల్ రెడ్డి చర్చలకు పిలిచాడు. ఈ క్రమంలో వేణుగోపాల్ రెడ్డికి ఆ […]

Update: 2020-08-18 04:10 GMT

దిశ, వెబ్ డెస్క్: బెజవాడ నోవాటెల్ హోటల్ వద్ద సోమవారం కారుపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బుల వ్యవహారమే హత్యాయత్నానికి ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. ఏడాది క్రితం నాగమణి-గంగాధర్ దంపతులు, కృష్ణారెడ్డిలకు వేణుగోపాల్‌ రెడ్డి అనే వ్యక్తి రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చాడు.

అయితే అప్పుగా తీసుకున్న సొమ్మును ఇవ్వకుండా నాగమణి-గంగాధర్ దంపతులు, కృష్ణారెడ్డి కాలం వెళ్లుబుచ్చుతున్నారు. ఫైనాన్స్ వ్యవహారం సెటిల్ మెంట్ చేసుకుందామని వారిని వేణుగోపాల్ రెడ్డి చర్చలకు పిలిచాడు. ఈ క్రమంలో వేణుగోపాల్ రెడ్డికి ఆ ముగ్గురికి మధ్య వివాదం నెలకొంది. దీంతో పథకం ప్రకారం వేణుగోపాల్‌రెడ్డి ముందుగానే తన వెంట తీసుకువచ్చిన పెట్రోల్‌ను కృష్ణారెడ్డి, నాగవల్లి-గంగాధర్ దంపతులపై, కారుపై పోసి నిప్పటించాడు.

అనంతరం వేణుగోపాల్ రెడ్డి అక్కడ నుంచి పరారయ్యాడు. ఒంటిపై మంటలతో కారు నుండి బయటకు వచ్చి కృష్ణారెడ్డి ప్రాణాలు కాపాడుకోగా… కారు వెనుక సీట్లో కూర్చోవడంతో నాగవల్లి, గంగాధర్ దంపతులు స్వల్ప గాయలతో బయటపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News