రెండో రోజు ట్రంప్ టూర్ ఇలా..
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రెండో రోజు పర్యటన రాష్ట్రపతి భవన్ దగ్గర స్వాగత కార్యక్రమంతో మొదలు కానుంది. అనంతరం ఆయన మహాత్మాగాంధీ స్మారకార్థం రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. పుష్పగుచ్ఛం పెట్టి ఒక నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. తర్వాత ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. దేశరాజధానిలోని హైదరాబాద్ హౌజ్‌లో ఉన్నతస్థాయి ప్రతినిధుల భేటీలు జరుగనున్నాయి. ఈ సమావేశాల తర్వాత హైదరాబాద్ హౌజ్‌లోనే.. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌లకు ప్రధాని […]
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రెండో రోజు పర్యటన రాష్ట్రపతి భవన్ దగ్గర స్వాగత కార్యక్రమంతో మొదలు కానుంది. అనంతరం ఆయన మహాత్మాగాంధీ స్మారకార్థం రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. పుష్పగుచ్ఛం పెట్టి ఒక నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. తర్వాత ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. దేశరాజధానిలోని హైదరాబాద్ హౌజ్‌లో ఉన్నతస్థాయి ప్రతినిధుల భేటీలు జరుగనున్నాయి. ఈ సమావేశాల తర్వాత హైదరాబాద్ హౌజ్‌లోనే.. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌లకు ప్రధాని మోడీ విందునివ్వనున్నారు. అనంతరం ట్రంప్ బస చేసిన ఐటీసీ మౌర్యలో ఆయనతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌లు భేటీ అవుతారు. సాయంత్రం 4.30 నిమిషాలకు యూఎస్ దౌత్య కార్యాలయంలో ఎంబస్సీ సిబ్బందిని ట్రంప్ కలుసుకోనున్నారు. రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడి గౌరవార్థం మనదేశ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు ట్రంప్ హాజరవుతారు. రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో ట్రంప్ కుటుంబం అమెరికాకు తిరుగుపయనం కానున్నారు.