‘ఓడిపోతే ప్రశాంతంగా అధికారమివ్వను’

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో ఎన్నికల వేడి పెరుగుతోంది. తాజా ట్రంప్ వ్యాఖ్యలు దీన్ని మరింత పెంచేలా ఉన్నాయి. ఎన్నికల్లో తాను ఓడిపోతే..ప్రశాంత వాతావరణంలో అధికారాన్ని అప్పగించనని అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు నాకు ఓటు వేయకపోవడం వల్ల ఓడిపోయినట్టుగా భావించనని, మెయిల్ ఓటింగ్ వల్లనే ఓటమిని ఎదుర్కొన్నట్టు భావిస్తానని వ్యాఖ్యానించారు. […]

Update: 2020-09-24 07:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో ఎన్నికల వేడి పెరుగుతోంది. తాజా ట్రంప్ వ్యాఖ్యలు దీన్ని మరింత పెంచేలా ఉన్నాయి. ఎన్నికల్లో తాను ఓడిపోతే..ప్రశాంత వాతావరణంలో అధికారాన్ని అప్పగించనని అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రజలు నాకు ఓటు వేయకపోవడం వల్ల ఓడిపోయినట్టుగా భావించనని, మెయిల్ ఓటింగ్ వల్లనే ఓటమిని ఎదుర్కొన్నట్టు భావిస్తానని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అక్రమ మార్గంలో గెలుపును దక్కించుకోవడానికి డెమోక్రటిక్ నేతలు మెయిల్ ఓటింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు.

‘మెయిల్ ఓటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను. ముందు మెయిల్ బ్యాలెట్లను వదిలించుకుందాం. అప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుంది. అలా జరిగితే అధికారం మార్చాల్సిన పనిలేదు. కొనసాగించవచ్చని’ విలేకరుల సమావేశంలో ట్రంప్ చెప్పారు. మెయిల్ బ్యాలెట్ల వల్ల పరిస్థితి సరిగా లేదని, దానికి కారణమెవరో తెలుసని డెమోక్రటిక్ పార్టీని ఉద్దేశించి ట్రంప్ విమర్శించారు.

Tags:    

Similar News