‘కొవిడ్‌ను ఓడించిన ట్రంప్’ పేరుతో నాణెం
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని తెలిసిన 24 గంటల లోపే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. కేవలం మూడ్రోజుల్లోనే ఆయన కరోనా నుంచి కోలుకుని వైట్‌హౌస్‌కు వచ్చాడు. అయితే, తాను కరోనాను జయించినందుకు గానూ వైట్‌హౌస్ గిఫ్ట్ షాపు ‘కొవిడ్‌ను ఓడించిన ట్రంప్’ పేరుతో నాణెలను తీసుకువస్తోంది. వాల్టర్ రీడ్ సైనిక ఆస్పత్రి నుంచి రెండ్రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన ట్రంప్ మాస్క్ లేకుండానే […]
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని తెలిసిన 24 గంటల లోపే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. కేవలం మూడ్రోజుల్లోనే ఆయన కరోనా నుంచి కోలుకుని వైట్‌హౌస్‌కు వచ్చాడు. అయితే, తాను కరోనాను జయించినందుకు గానూ వైట్‌హౌస్ గిఫ్ట్ షాపు ‘కొవిడ్‌ను ఓడించిన ట్రంప్’ పేరుతో నాణెలను తీసుకువస్తోంది.
వాల్టర్ రీడ్ సైనిక ఆస్పత్రి నుంచి రెండ్రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన ట్రంప్ మాస్క్ లేకుండానే వైట్‌హౌస్‌కు రావడంతో విమర్శలు ఎదుర్కొన్న విషయం విదితమే. ఏడు పదుల వయసులో కరోనాను ఓడించడంతో ఆయన అభిమానులు ట్రంప్‌ను వారియర్‌గా అభివర్ణిస్తున్నారు. దీన్ని కరోనాపై ట్రంప్ విజయానికి చిహ్నంగా మలచాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వైట్‌హౌస్ గిఫ్ట్ షాపు ‘ట్రంప్ డిఫీట్స్ కొవిడ్’ (కొవిడ్‌ను ఓడించిన ట్రంప్) అనే పేరుతో స్మారక నాణేలను తీసుకురాబోతుంది. ఈ గిఫ్ట్ షాప్ వైట్‌హౌస్ అఫిలియేటెడ్ కాదు. 100 డాలర్ల విలువ గల నాణేన్ని కావాల్సిన వారు ప్రీ ఆర్డర్ చేసుకోవాలని గిఫ్ట్ షాప్ బృందం తెలిపింది. పరిమిత సంఖ్యలో ముద్రిస్తున్న ఈ నాణెలను వచ్చే నెల 14 నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తామని దీని రూపశిల్పి, వైట్‌హౌస్ గిఫ్ట్ షాప్ చైర్మన్ ఆంథోని గియాన్ని తెలిపారు. ఈ నాణేల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం కరోనా నివారణకు, క్యాన్సర్ బాధితుల చికిత్సకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ నాణెం ఎలా ఉంటుంది?, దాని మీద ఎలాంటి ఆర్ట్ వర్క్ ఉంటుంది? అన్నది ఇంతవరకు తెలియలేదు. కానీ, కాయిన్ మీద సూపర్ హీరో గ్రాఫిక్ ఉంటుందని తెలియజేశాడు. వైట్ హౌస్ గిఫ్ట్ షాపు గతంలో ట్రంప్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌లు 2018లో సింగపూర్‌లో కలిసినందుకు గానూ ఆ భేటికి చిహ్నంగా ఓ నాణెన్ని విడుదల చేసింది.