ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 14 మంది మృతి

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ట్రాక్టర్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు రాజస్థాన్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు […]

Update: 2021-01-18 20:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ట్రాక్టర్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు రాజస్థాన్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News