TRS కు గుడ్ బై చెప్పిన ముఖ్యనేతలు వీరే..

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే వారంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్‌కు మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీఆర్ఎస్ ముఖ్యనేతలు సైతం గులాబీ పార్టీకి గుడ్ బై పలికారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ముఖ్యనేతలు వీరే.. 1.శ్రీమతి తుల […]

Update: 2021-06-04 07:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే వారంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్‌కు మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీఆర్ఎస్ ముఖ్యనేతలు సైతం గులాబీ పార్టీకి గుడ్ బై పలికారు.

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ముఖ్యనేతలు వీరే..

1.శ్రీమతి తుల ఉమ – టీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి (మాజీ జిల్లాపరిషత్ చైర్ పర్సన్)
2. అందె బాబయ్య ముదిరాజ్ – టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి
3. వీకే మహేశ్ ముదిరాజ్ – టీఆర్ఎస్ పార్టీ సంయుక్త కార్యదర్శి (మున్సిపల్ మాజీ చైర్మన్- మల్కాజిగిరి)
4.శ్రీ దేవి – (మాజీ కార్పొరేటర్, నేరేడ్ మెట్)
5.నాగకుమారి – బ్రహ్మణసేవా సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు
6. గండ్ర నళిని – మాజీ ఇంచార్జి వేములవాడ నియోజకవర్గం (MLAగా పోటీ చేసిన అభ్యర్థి)
7. జీకే. హనుమంతరావు – మల్కాజిగిరి బిల్డర్స్ మాజీ అధ్యక్షులు
8. డి. మధుసూధన్ రెడ్డి – గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి
9. మోహన్ యాదవ్ – మౌలాలి 138 డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

పైన పేర్కొన్న నాయకులు టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా చేయడంతో పాటు తమ సంతకాలతో కూడిన లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయానికి పంపించారు.

New doc Jun 4, 2021 11.43 AM (2) trs leders resignation letter

Tags:    

Similar News