ఆ సర్వేల్లో గెలుపు ‘గెల్లు’దే.. టీఆర్ఎస్ కొత్త అస్త్రం ఇదేనా..?

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈక్రమంలో పార్టీల ముఖ్య నేతలంతా హుజురాబాద్‌లోనే మకాం వేశారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌కు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హుజురాబాద్‌కే పరిమితమయ్యారు. అంతేకాకుండా బీజేపీ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి, అర్వింద్‌లు ఈటలకు సపోర్ట్‌గా నిలిచారు. కాంగ్రెస్ అనూహ్యంగా […]

Update: 2021-10-27 09:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈక్రమంలో పార్టీల ముఖ్య నేతలంతా హుజురాబాద్‌లోనే మకాం వేశారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌కు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హుజురాబాద్‌కే పరిమితమయ్యారు. అంతేకాకుండా బీజేపీ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి, అర్వింద్‌లు ఈటలకు సపోర్ట్‌గా నిలిచారు.

కాంగ్రెస్ అనూహ్యంగా బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపి.. ఇంటికి ఒక ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు. ఈక్రమంలో గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వం పూర్తయ్యింది. దీంతో హుజురాబాద్‌లో ఉన్న వారంతా ఇళ్లకు పయనమయ్యారు.

ఇప్పటి వరకు పార్టీలంతా ఇంటింటి ప్రచారం చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దూసుకుపోతున్నాయి. పార్టీ శ్రేణులు వాట్సప్ స్టేటస్‌లు, గ్రూపుల్లో ప్రచారం చేస్తూ సందడి చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం సర్వేల పేరుతో అన్ని గ్రూపుల్లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. కాలనీ, గ్రామాలు, ప్రెస్ గ్రూపుల్లో అవసరం లేకున్నా సర్వేల్లో గెల్లుకు విజయ అవకాశాలని, ఆయనకే ఎక్కువ శాతం ఓట్లు పడబోతున్నాయని సర్వే రిపోర్టులను తెగ షేర్ చేస్తున్నారు.

ఈ విధంగా అధికార పార్టీ కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చింది. సర్వేల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని మైండ్స్ డైవర్ట్ చేసే విధంగా కొత్త ఎత్తుగడ ఎత్తుకుందని ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి సర్వే రిపోర్టులను గ్రూపుల్లో వేయడంతో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకుల్లో గొడవలకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా పార్టీల శ్రేణులు కొత్త కొత్త స్ట్రాటజీలతో సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారనే చెప్పాలి.

ప్రలోభాలకు గురిచేస్తున్నారా?.. అయితే ఇలా చేయండి

హుజురాబాద్‌లోని 5 మండలాల్లో మొత్తం 73 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. ఇక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు మద్యం, నగదు పంపిణీ జరపకుండా చూసేందుకు దాదాపు 2,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ, పోలీసుల కళ్లు కప్పి జరిపే అక్రమాలపై ఎవరైనా ప్రచారం చేయొచ్చని ఈసీ ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ లేదా ఐ ఫోన్‌లో ‘సీ–విజిల్‌’ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని లాగిన్ అవ్వాలి. జీపీఎస్‌ లొకేషన్‌ ఆన్‌ చేసి ఆ వీడియో తీసి ఈసీకి ఫిర్యాదు చేస్తే నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటుంది.

Tags:    

Similar News