టీఆర్ఎస్ ఎంపీపీ భర్త దౌర్జన్యం.. గ్రామస్తుల ఇండ్లలోకి చొచ్చుకెళ్లి దాడి
దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని గుర్రంపోడు తండాలో గిరిజనులు నిర్వహించిన వేడుకల్లో ప్లెక్సీల వివాదం గందరగోళంగా మారింది. స్థానికుల వివరాల ప్రకారం.. గుర్రంపోడు తండాలో ఆదివారం గిరిజనులు శ్రీ సంత్ సేవాలాల్, మేరమ్మయాడి జాతరను నిర్వహించారు. సోమవారం జాతర సందర్భంగా కోలాటం కార్యక్రమాన్ని గిరిజనులందరూ కలిసి నిర్వహించారు. అయితే, ఈ కోలాటం నిర్వహించే చోట అధికార పార్టీకి చెందిన నాయకులు ఫ్లెక్సీని పెట్టడంతో అక్కడున్న గ్రామస్థులు ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, ప్రజలందరూ […]
దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని గుర్రంపోడు తండాలో గిరిజనులు నిర్వహించిన వేడుకల్లో ప్లెక్సీల వివాదం గందరగోళంగా మారింది. స్థానికుల వివరాల ప్రకారం.. గుర్రంపోడు తండాలో ఆదివారం గిరిజనులు శ్రీ సంత్ సేవాలాల్, మేరమ్మయాడి జాతరను నిర్వహించారు. సోమవారం జాతర సందర్భంగా కోలాటం కార్యక్రమాన్ని గిరిజనులందరూ కలిసి నిర్వహించారు. అయితే, ఈ కోలాటం నిర్వహించే చోట అధికార పార్టీకి చెందిన నాయకులు ఫ్లెక్సీని పెట్టడంతో అక్కడున్న గ్రామస్థులు ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, ప్రజలందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగని ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, అధికార పార్టీకి చెందిన స్థానిక ఎంపీపీ మూడావత్ పార్వతిది అదే గ్రామం కావడంతో, టీఆర్ఎస్ శ్రేణులు ఈ ప్లెక్సీల విషయాన్ని ఎంపీపీ భర్త కొండా నాయక్‌కు తెలియజేశారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా నాయక్.. తమ పార్టీ ప్లెక్సీనే అడ్డుకుంటారా? అని అభ్యంతరం వ్యక్తం చేసిన పలువురు గ్రామస్తుల ఇండ్లపైకి అనుచరులతో దాడికి దిగాడు. కర్రలతో ఇండ్లలోకి చొచ్చుకెళ్లి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో 15 మందికి గాయాలు కాగా వారిని స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. అధికార పార్టీ ఎంపీపీగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి భర్తనే ప్రజలపై దాడులు చేయడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. గ్రామాల్లో జరుపుకొనే పండుగలకు అసలు రాజకీయాలతో సంబంధమేమిటని, ప్లెక్సీ వద్దన్నందుకు దౌర్జన్యాలు, దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఎంపీపీ భర్తే స్వయంగా కర్రలు పట్టుకుని ఇండ్లపై దాడి చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.