ఎంజీఎంకు రూ.14.50 లక్షల ఎంపీ నిధులు

దిశ ప్రతినిధి, వరంగల్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ వరంగల్‌లోని మహత్మగాంధీ మెమోరియల్ ఆస్ప‌త్రికి తన ఎంపీ నిధుల నుంచి రూ. 14.50 ల‌క్ష‌లు అంద‌జేశారు. ఆస్పత్రిలో కొవిడ్ -19వార్డుల్లో అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి ఆ మొత్తాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల కిందటే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు సమ్మతి తెలుపుతూ లేఖ ఇచ్చారు. ఈ నిధులను ఉపయోగించి 20 బీ పాప్ (బై లెవ‌ల్‌ పాజిటివ్ ఎయిర్‌వే […]

Update: 2020-07-25 12:02 GMT

దిశ ప్రతినిధి, వరంగల్
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ వరంగల్‌లోని మహత్మగాంధీ మెమోరియల్ ఆస్ప‌త్రికి తన ఎంపీ నిధుల నుంచి రూ. 14.50 ల‌క్ష‌లు అంద‌జేశారు. ఆస్పత్రిలో కొవిడ్ -19వార్డుల్లో అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి ఆ మొత్తాన్ని కేటాయించారు. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల కిందటే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు సమ్మతి తెలుపుతూ లేఖ ఇచ్చారు.

ఈ నిధులను ఉపయోగించి 20 బీ పాప్ (బై లెవ‌ల్‌ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్) యంత్రాలు, ఒక మొబైల్ ఎక్స్‌రే యంత్రం, 10 ఎలక్ట్రిక్ సక్షన్ యంత్రాలను కొనుగోలు చేయాల్సిందిగా సూచించారు. ఆస్పత్రిని సందర్శించే రోగులు సమస్యలను ఎదుర్కొంటున్నందున తాను ఈ నిధులు కేటాయిస్తున్నానని బండా ప్రకాష్ తెలిపారు.

ప్రజలకు సహాయం చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాన‌ని ఆయన చెప్పారు. మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, భౌతిక దూరం పాటించ‌డం వంటి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీ బండా ప్రకాశ్ ప్రజలకు సూచించారు.

Tags:    

Similar News