దళిత బంధుపై ఈటల కుట్ర.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ
దిశ, జమ్మికుంట: దళిత బంధుపై ఈటల రాజేందర్ కుట్ర చేశారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. దళితులు బాగుపడటం ఇష్టం లేకనే దళిత బంధును ఆపేయాలని ఎన్నికల కమిషన్‌కు ఈటల ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొంత ఆస్తులను కూడబెట్టుకునేందుకే ఈటల తాపత్రయ పడుతున్నారని, తన రాజకీయ జీవితంలో ఈటల ఏనాడు దళితులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సీఎం కేసీఆర్ దళితులను […]
దిశ, జమ్మికుంట: దళిత బంధుపై ఈటల రాజేందర్ కుట్ర చేశారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. దళితులు బాగుపడటం ఇష్టం లేకనే దళిత బంధును ఆపేయాలని ఎన్నికల కమిషన్‌కు ఈటల ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొంత ఆస్తులను కూడబెట్టుకునేందుకే ఈటల తాపత్రయ పడుతున్నారని, తన రాజకీయ జీవితంలో ఈటల ఏనాడు దళితులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
సీఎం కేసీఆర్ దళితులను లక్షాధికారులను చేయాలని చూస్తే.. ఈటల ఓర్వలేకపోతున్నారని, అలాంటి ఈటలను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలి సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దళిత బంధును టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుందన్నారు. ఈటల రాజేందర్ రాజీనామా ఎందుకు చేశారో హుజురాబాద్ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలో గెలిచి ఈటల ఒక్కరే బాగుపడాలో.. టీఆర్ఎస్‌ను గెలిపించి హుజురాబాద్ బాగుపడాలో ప్రజలు ఆలోచించాలన్నారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి ఏమి చేయలేని వ్యక్తి ప్రతి ప్రక్ష ఎమ్మెల్యేగా ఏం సాధిస్తారు అని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌కు వస్తున్న ఆదరణను చూసి ఈటలకు మతి తప్పింది అంటూ సుంకె రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ సరిగమల పావనిలు పాల్గొన్నారు.