శ్రీదేవిని ఏడిపించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్(వీడియో)
దిశ, మహబూబాబాద్ టౌన్ : నిత్యం వివాదాలతో వార్తల్లో ఉండటం మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు స్టైల్‌గా మారింది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులనే ఎవరు మీరు.. ఏ పార్టీ మీదంటూ ప్రశ్నించి కన్నీరు పెట్టేలా చేశాడు. ఏ తప్పు చేయని పార్టీ నేతలు, కార్యకర్తలపై వేదికపై నుంచే కారాలు-మిరియాలు నూరినట్లుగా వ్యవహరించడం గమనార్హం. శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక పార్టీ నాయకులతో పాటు కౌన్సిలర్లు […]
దిశ, మహబూబాబాద్ టౌన్ : నిత్యం వివాదాలతో వార్తల్లో ఉండటం మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు స్టైల్‌గా మారింది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులనే ఎవరు మీరు.. ఏ పార్టీ మీదంటూ ప్రశ్నించి కన్నీరు పెట్టేలా చేశాడు. ఏ తప్పు చేయని పార్టీ నేతలు, కార్యకర్తలపై వేదికపై నుంచే కారాలు-మిరియాలు నూరినట్లుగా వ్యవహరించడం గమనార్హం. శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక పార్టీ నాయకులతో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు.
అయితే మహిళా కౌన్సిలర్లతో పాటు పలువురు ఇతర నాయకులు కూడా పార్టీ కండువాలు వేసుకోలేదు. దీన్ని గమనించిన ఎమ్మెల్యే అతి ఆగ్రహం చూపెడుతూ ఎవరు మీరు.. ఏ పార్టీ మీది కండువాలు వేసుకోవానికి కూడా నాముషీనా అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఎమ్మెల్యే వింత వైఖరితో మనసు నొచ్చుకున్న మహిళా కౌన్సిలర్ శ్రీదేవి కంటతడి పెట్టారు. ఆమె ఓ వైపు ఏడుస్తున్నా కూడా ఎమ్మెల్యే శంకర్ నాయక్ నేతలపై చిర్రబుర్రులాడారు. ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ తన వైఖరి, మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే సారీ అంటూ చల్లగా వెళ్లిపోవడం శంకర్‌నాయక్‌కే చెల్లింది. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రవర్తనపై పార్టీలో రకరకాలుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.