టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ సంచలన ఆరోపణ

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ ప్రకటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని విమర్శించారు. మునిగిపోయే పడవకు ఎవరిని అధ్యక్షుడిగా నియమించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు. టీపీసీసీ నియామకం తర్వాత ఆ పార్టీలు ఆలకలు.. బుజ్జగింపులతో మరింత కనుమరుగు అవుతుందని అన్నారు. గతంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో రేవంత్‌ రెడ్డి టీడీపీని నట్టేటా ముంచేశారని.. ఇప్పుడు […]

Update: 2021-06-28 07:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ ప్రకటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని విమర్శించారు. మునిగిపోయే పడవకు ఎవరిని అధ్యక్షుడిగా నియమించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు. టీపీసీసీ నియామకం తర్వాత ఆ పార్టీలు ఆలకలు.. బుజ్జగింపులతో మరింత కనుమరుగు అవుతుందని అన్నారు. గతంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో రేవంత్‌ రెడ్డి టీడీపీని నట్టేటా ముంచేశారని.. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా మునగడం ఖాయమని.. అందులో అసలు అనుమానమే లేదని తెలిపారు.

రేవంత్‌ రెడ్డి నోటికి ఏది వస్తే.. అదే మాట్లాడతారని, రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయడంతోనే కాంగ్రెస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని వెల్లడించారు. అంతేగాకుండా.. దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ అని.. రాజ్యాంగ రచయిత అంబేద్కర్‌ను గుర్తించని పార్టీ కాంగ్రెస్ అని బాల్క సుమన్‌ ఫైర్‌ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై అరాచక దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. కొత్త టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News