వివాదంలో మంత్రి పువ్వాడ.. వైరల్ అవుతోన్న అనుచరుల బూతుపురాణం ఆడియో

దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ సోషల్ మీడియా నియోజకవర్గ ఇంచార్జ్ ఓ పురోహితుడుకి కాల్ చేసి బూతు పురాణంతో బెదిరించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన పురోహితుడు రవిచంద్ర, అదే గ్రామానికీ చెందిన లోకల్ వాట్సాప్ గ్రూప్‌లో మంత్రి పువ్వాడ అజయ్ ప్రచార పోస్టింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహానికి‌లోనైన అశ్వారావుపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మోటూరి మోహన్, రవి చంద్రకి కాల్ చేసి బూతుపురాణంతో బెదిరించిన […]

Update: 2021-08-18 05:21 GMT

దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ సోషల్ మీడియా నియోజకవర్గ ఇంచార్జ్ ఓ పురోహితుడుకి కాల్ చేసి బూతు పురాణంతో బెదిరించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన పురోహితుడు రవిచంద్ర, అదే గ్రామానికీ చెందిన లోకల్ వాట్సాప్ గ్రూప్‌లో మంత్రి పువ్వాడ అజయ్ ప్రచార పోస్టింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహానికి‌లోనైన అశ్వారావుపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ మోటూరి మోహన్, రవి చంద్రకి కాల్ చేసి బూతుపురాణంతో బెదిరించిన కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రి ప్రచార పోస్టింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడతావా, నీ సంగతి చూస్తా, పోలీస్ స్టేషన్‌కు పిలిపించమంటావా, జాగ్రత్తగా ఉండకపోతే చితకబాదిస్తా అని బెదిరించాడు. పురోహితుడు రవిచంద్ర భయపడకుండా సమాధానం చెప్పడంతో కాల్ కట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కాల్ రికార్డింగ్ హల్ చల్ చేస్తోంది.

Tags:    

Similar News