రైతు కుటుంబానికి అండగా ఉంటాం : టీఆర్ఎస్ నాయకులు
దిశ, మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలో అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి కౌలు రైతు ఏరుకొండ యాదయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతు కుటుంబానికి అండగా ఉంటానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఏరుకొండ యాదయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుని కుటుంబ సభ్యులకు […]
దిశ, మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలో అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి కౌలు రైతు ఏరుకొండ యాదయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతు కుటుంబానికి అండగా ఉంటానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఏరుకొండ యాదయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుని కుటుంబ సభ్యులకు రైతు బీమా సహాయాన్ని వెంటనే అందించాలని సంబంధిత అధికారులను కోరారు. నివాళులర్పించిన వారిలో మండల కో-ఆప్షన్ సభ్యులు ఎండీ రఫీ, చోల్లేడు ఎంపీటీసీ వనం నిర్మల యాదయ్య, మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న, టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జెట్టి గణేష్, కార్మిక విభాగం మండల అధ్యక్షుడు కట్కూరి శంకర్, తదితరులు ఉన్నారు.