విద్యార్థి నాయకుడిపై టీఆర్ఎస్ హత్యాయత్నం..?

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యార్థి పరిషత్, ఓయూ విద్యార్థి నాయకుడు జటంగి సురేష్‌ యాదవ్‌పై అధికార పార్టీ నాయకుల హత్యాయత్నం మరోసారి కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడన్న నేపథ్యంలో గతంలో బాల్క సుమన్ అనుచరులు దాడి చేసినట్టు సురేష్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పహాడ్‌(సురేష్ స్వస్థలం)లో 20మంది టీఆర్ఎస్ నాయకులు చంపేందుకు ప్రయత్నం చేశారని బాధితుడు […]

Update: 2021-06-22 20:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యార్థి పరిషత్, ఓయూ విద్యార్థి నాయకుడు జటంగి సురేష్‌ యాదవ్‌పై అధికార పార్టీ నాయకుల హత్యాయత్నం మరోసారి కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడన్న నేపథ్యంలో గతంలో బాల్క సుమన్ అనుచరులు దాడి చేసినట్టు సురేష్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపింది.

తాజాగా.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పహాడ్‌(సురేష్ స్వస్థలం)లో 20మంది టీఆర్ఎస్ నాయకులు చంపేందుకు ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.. ఆధారాలు చూపిస్తున్నాడు. ఈ సంఘటనలో తనతో పాటు అడ్డొచ్చిన సోదరుడు మహేష్‌, గ్రామస్తులకు తీవ్రంగా గాయాలు అయినట్టు చెబుతున్నాడు. పాతర్ల పహాడ్‌ గ్రామంలో జరుగుతున్న జాతరను చూసేందుకు వస్తే.. పథకం వేసి టీఆర్ఎస్ నాయకులు తనపై దాడి చేశారన్నాడు. ఈ దాడిలో నూతన్‌కల్ ప్రస్తుత పీఏసీఎస్ చైర్మన్ కనగంటి వెంకన్నతో సహా మరో 20 మంది ఉన్నట్టు తెలిపాడు. ప్రస్తుతం సురేష్ సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే జటంగి సురేష్‌ యాదవ్‌‌కు ఈటల రాజేందర్ ఫోన్ చేసి పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితం జటంగి సురేష్.. ఈటల రాజేందర్‌, జర్నలిస్టు రఘును కలిసి వారికి మద్దతు తెలిపాడు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై దాడి సంచలనం రేపుతోంది.

ఈట‌ల అంతర్గత సంభాష‌ణ‌ల ఆడియో లీక్‌.. వైరల్!

Tags:    

Similar News