ఆ డివిజన్లలో టీఆర్ఎస్ లీడర్ల పెత్తనం… ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ రాజతంత్రం
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని విపక్ష కార్పోరేటర్ల డివిజన్లలో టీఆర్‌ఎస్ నేతల పెత్తనం పెరుగుతోంది… కాదు పెరిగేలా ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ చేస్తున్నారంట. కొట్టకుండా.. తిట్టకుండా అన్నట్లుగా డివిజన్‌కు వెళ్లకుండా.. గౌరవం దక్కకుండా చేస్తూ.. టీఆర్‌ఎస్ లీడర్ల పెత్తనం పెరిగేలా చేస్తూ అంతా వారే చూసుకునేది అనే మెసేజ్ ఇస్తుండటం గమనార్హం. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 10 డివిజన్లలో టీఆర్‌ఎసేతర కార్పోరేటర్లు ఉన్నారు. వీరి డివిజన్లలో ఎమ్మెల్యే తన అనుచరులకు డివిజన్ […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని విపక్ష కార్పోరేటర్ల డివిజన్లలో టీఆర్‌ఎస్ నేతల పెత్తనం పెరుగుతోంది… కాదు పెరిగేలా ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ చేస్తున్నారంట. కొట్టకుండా.. తిట్టకుండా అన్నట్లుగా డివిజన్‌కు వెళ్లకుండా.. గౌరవం దక్కకుండా చేస్తూ.. టీఆర్‌ఎస్ లీడర్ల పెత్తనం పెరిగేలా చేస్తూ అంతా వారే చూసుకునేది అనే మెసేజ్ ఇస్తుండటం గమనార్హం. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 10 డివిజన్లలో టీఆర్‌ఎసేతర కార్పోరేటర్లు ఉన్నారు. వీరి డివిజన్లలో ఎమ్మెల్యే తన అనుచరులకు డివిజన్ బాధ్యతలను అప్పగించి.. అనధికార కార్పోరేటర్లుగా చెలామణిలోకి తెస్తున్నారన్న విమర్శలున్నాయి. కార్పోరేటర్‌తో సంబంధం లేకుండా డివిజన్‌లో పనులు నిర్వహించడం, ప్రతిపాదనలు చేయించడం, అభివృద్ధి పనులకు జనాలకు హామీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కుల అందజేత వంటివన్నీ టీఆర్‌ఎస్ లీడర్లే చూసుకుంటుడటం గమనార్హం.
కార్పోరేషన్ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు చెప్పుకోదగిన స్థాయిలో ఏ డివిజన్‌లోనూ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. అయితే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి మాత్ర లబ్ధిదారులకు సాయం అందుతోంది. పలు పథకాల కింద చెక్కులను అందజేస్తూ వస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్‌పై గెలిచిన కార్పోరేటర్ల డివిజన్లలో పర్యటించి మరీ చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే వినయ్.. టీఆర్‌ఎసేతర పార్టీ కార్పోరేటర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లకు మాత్రం వెళ్లడం లేదు. డివిజన్‌లో పర్యటించకుండా ఆ డివిజన్‌లో ఉంటున్న టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన లీడర్ల ద్వారా లబ్ధిదారులను క్యాంపు ఆఫీసు లేదా ఇతర వేదికలపై అందజేస్తుండటం గమనార్హం.
అంతా నేనే… అంతా తామే…
లబ్ధిదారులు టీఆర్‌ఎస్ పార్టీకి విధేయులుగా ఉండేందుకే ఇలా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలకు డివిజన్‌లో రాజకీయ ప్రాధాన్యం పెరిగేలా ఎమ్మెల్యే పావులు కదుపుతున్నారని, ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రగానే బాధిత కార్పోరేటర్లు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం మా డివిజన్‌లో ప్రారంభం కాలేదని వాపోతున్నారు.
31వ డివిజన్‌కు చెందిన దాదాపు 18మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను శుక్రవారం వరంగల్ అర్భన్ కలెక్టరేట్‌లో అందజేశారు. ఈ చెక్కుల పంపిణీకి కార్పోరేటర్ (స్వతంత్ర) రాజుకు పిలుపు అందలేదు. డివిజన్‌లో కాకుండా కలెక్టరేట్‌లో అందజేసిన నేపథ్యంలో ప్రొటోకాల్ వర్తించదు.. కార్పోరేటర్‌ను పిలవకున్నా ఫర్వాలేదు. అయితే ఇదే డివిజన్‌కు చెందిన టీఆర్‌ఎస్ నేతలు, చోటా మోటాలీడర్లు, ఈ కార్యక్రమంతో సంబంధం లేని పదవుల్లో ఉన్న నేతలు పాల్గొనడం గమనార్హం.