నాయిని మృతికి నేతల సంతాపం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మృతికి మంత్రి ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు. ఉద్యమ సమయంలో నాయినితో ఉన్న అనుబంధం మరువలేనిదన్నారు. ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. అపోలో ఆస్పత్రిలో నాయిని పార్థీవదేహానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నివాళులర్పించారు. నాయిని కుటుంబ సభ్యులకు […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మృతికి మంత్రి ఈటల రాజేందర్ సంతాపం ప్రకటించారు. ఉద్యమ సమయంలో నాయినితో ఉన్న అనుబంధం మరువలేనిదన్నారు. ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
అపోలో ఆస్పత్రిలో నాయిని పార్థీవదేహానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నివాళులర్పించారు. నాయిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాయిని కుటుంబానికి సంతాపం ప్రకటించారు. హోంమంత్రిగా, కార్మిక నేతగా విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేదన్నారు.
నాయిని నర్సింహారెడ్డి మృతిపై మంత్రి కొప్పుల ఈశ్వర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో కలిసి పని చేశానని కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు. నాయిని గొప్ప పోరాట యోధుడని అన్నారు. ఆయన మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి పూడ్చలేనిదన్నారు.