బతుకమ్మను అవమానించలేదు.. నిరూపణకు మీరు రెడీనా : TRS నేతల సవాల్
దిశ, ఆత్మకూర్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి తెలంగాణ పండుగలు, మహిళలు అంటే చాలా గౌరవం ఉందని, కొందరు వారి రాజకీయ భవిష్యత్తు కోసం ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అసత్య ఆరోపణలు మానుకోవాలని.. లేకుంటే వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆత్మకూరు ఏఎంసీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు.. తన చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. […]
దిశ, ఆత్మకూర్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి తెలంగాణ పండుగలు, మహిళలు అంటే చాలా గౌరవం ఉందని, కొందరు వారి రాజకీయ భవిష్యత్తు కోసం ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అసత్య ఆరోపణలు మానుకోవాలని.. లేకుంటే వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆత్మకూరు ఏఎంసీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు.. తన చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
బుధవారం సెంట్రల్ లైటింగ్ ఓపెనింగ్ కోసం వచ్చిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. కారు దిగి కాలినడకన వెళ్లి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. అనంతరం బతుకమ్మ ఆడుతున్న మహిళల దగ్గరికి వెళ్లి వారిని పలకరించారని అన్నారు. కానీ, కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఆత్మకూరు మండల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చల్లా అనునిత్యం పరితపిస్తున్నారని, కానీ దీనికి గ్రామ సర్పంచ్ సహకరించడంలేదని అన్నారు.
ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ తన తప్పు తెలుసుకొని ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని కోరారు. అనంతరం నీరుకుల్లా గ్రామ సర్పంచ్ అర్షం బలరాం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చల్లా బతుకమ్మ ఆడుతున్న మహిళలను ఆగౌరవ పరచలేదని ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని తెలిపారు. అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు కావాలని గొడవకు దిగాడని, నేను ఒక సర్పంచ్‌ను, దళితుడిని అని కూడా చూడకుండా తనతో దుర్భాషలాడాడని అన్నారు.
గ్రామ ప్రజలు తనకు తగిన విధంగా బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ మార్క సుమలత రజనీకర్, జడ్పీటీసీ కక్కేర్ల రాధిక రాజు, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పాపని రవీందర్, పెద్దాపురం సర్పంచ్ కమల రాజేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, నాయకులు భాష బోయిన సాగర్, పైడి, అర్షం మధుకర్, తదితరులు పాల్గొన్నారు.