బీజేపీ నేతపై టీఆర్ఎస్ నేతల దాడి..
దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి మండలంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు తారాస్థాయికి చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి యానంపల్లి గ్రామానికి చెందిన ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవి బూత్ కమిటీల ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బూత్ కమిటీల ఏర్పాటు చేయడం టీఆర్ఎస్ పార్టీకి నష్టం కలుగుతుందని భావించిన టీఆర్ఎస్ నేతలు ఎస్టీ మోర్చ అధ్యక్షుడు రవిపై ఎమ్మెల్యే బాజిరెడ్డి అనుచరలు దాడి చేశారు. ఈ దాడిలో రవికి తీవ్రరక్తస్రావం అయింది. దీంతో […]
దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి మండలంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు తారాస్థాయికి చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి యానంపల్లి గ్రామానికి చెందిన ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవి బూత్ కమిటీల ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బూత్ కమిటీల ఏర్పాటు చేయడం టీఆర్ఎస్ పార్టీకి నష్టం కలుగుతుందని భావించిన టీఆర్ఎస్ నేతలు ఎస్టీ మోర్చ అధ్యక్షుడు రవిపై ఎమ్మెల్యే బాజిరెడ్డి అనుచరలు దాడి చేశారు. ఈ దాడిలో రవికి తీవ్రరక్తస్రావం అయింది. దీంతో అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉందగా.. ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మనుషులు, దర్పల్లి జెడ్పీటీసీ జగన్మోహన్ మనుషుల ప్రోద్బలంతో రవిపై రాడ్లు, కత్తులతో యానంపల్లి ఉపసర్పంచ్ వినోద్ దాడి చేసినట్లు బీజేపీ యువ మోర్చా మండలాధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు.
ఇవాళ మదనపల్లికి రానున్న ఎంపీ అరవింద్
మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రవిపై దాడి ఎలా జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎంపీ ధర్మపురి అరవింద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామానికి శనివారం సాయంత్రం రానున్నారని వెంకటరమణ తెలిపారు. ఇదిలా వుండగా గాయపడ్డ మండల ఎస్సీ మోర్చ అధ్యక్షుడు రవిని రాత్రి పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.