కేటీఆర్ ఇలాకాలో అధికారులకు షాక్.. తిరగబడ్డ టీఆర్ఎస్ నేతలు(వీడియో)
దిశ ప్రతినిధి, కరీంనగర్: వద్దంటున్నా విలీనం చేశారు.. ఇప్పడేమో వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి అధికార పార్టీ నాయకులు. అభివృద్ధి విషయంలో పట్టించుకోరు, అధికారులు వచ్చినా సమాచారం ఇవ్వరు.. మునిసిపాలిటీలో చేరినా ఫలితం లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే ఈ పరిస్థితి చోటు చేసుకోవడం గమనార్హం. మెరుగైన సేవలు అందుతాయన్న కలలు కన్న తమకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: వద్దంటున్నా విలీనం చేశారు.. ఇప్పడేమో వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి అధికార పార్టీ నాయకులు. అభివృద్ధి విషయంలో పట్టించుకోరు, అధికారులు వచ్చినా సమాచారం ఇవ్వరు.. మునిసిపాలిటీలో చేరినా ఫలితం లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే ఈ పరిస్థితి చోటు చేసుకోవడం గమనార్హం. మెరుగైన సేవలు అందుతాయన్న కలలు కన్న తమకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, పాలకవర్గం శ్రద్ధ కనబర్చడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జిల్లా అడిషనల్ కలెక్టర్‌తో పాటు, మునిసిపల్ అధికారుల ముందే తమ గోడు వెళ్లబోసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే…
గత సంవత్సరంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల సమయంలో సిరిసిల్ల పట్టణ శివార్లలోని 7 పంచాయతీలను విలీనం చేశారు. మునిసిపాలిటీలో కలిస్తే అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని కలలు కన్నారు. మంత్రి కేటీఆర్ ప్రతిపాదనను కొంతమంది వ్యతిరేకించినా చివరకు ఒప్పుకున్నారు. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాలు కొత్త పుంతలు తొక్కుతాయని భావించారు. ప్రస్తుతం విలీన గ్రామాల అభివృద్ధి ఊసే లేకుండా పోయిందన్న ఆవేదనలకు లోనవుతున్నారు. తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని, మునిసిపల్ యంత్రాంగం పట్టణంలోని వార్డులపై చూపిస్తున్న శ్రద్ధను విలీన గ్రామాలపై చూపడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిరిసిల్ల పట్టణం అంతా వరదమయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు అదనపు కలెక్టర్ సత్యప్రసాద్‌తో పాటు మునిసిపల్ కమిషనర్ ఇతర అధికారులు సోమవారం సాయంత్రం వచ్చారు. పట్టణంలోని 24వ వార్డు పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. అయితే అధికారులు విజిట్ చేస్తున్న విషయం ముందస్తుగా ఆ ఏరియా కౌన్సిలర్ బుర్ర లక్ష్మికి సమాచారం ఇవ్వలేదు. క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో కౌన్సిలర్‌కు సమాచారం ఇచ్చారు.
దీంతో అక్కడకు చేరుకున్న కౌన్సిలర్ లక్ష్మి, ఆమె తనయడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మల్లిఖార్జున్‌లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించే విషయం తమకు ముందుగా ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తమ కాలనీలో ఆరు నెలల క్రితం విద్యుత్ స్తంభం వంగిపోయిందని, దీంతో స్థానికులు ప్రమాదం అంచున జీవనం సాగిస్తున్నారని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని కౌన్సిలర్ నిలదీశారు. విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో కనెక్షన్ల కోసం వినియోగదారులు 300 నుండి 400 మీటర్ల దూరం నుండి సర్వీసు వైర్లు వేసుకోవాల్సి వస్తుందని చెప్పినా.. సెస్ అధికారులకు డబ్బులు చెల్లించాం వస్తాయంటూ సమాధానం ఇస్తూ కాలయాపన చేస్తున్నారు తప్పా సమస్యను పరిష్కరించడం లేదంటూ మండిపడ్డారు.
క్విట్ మునిసిపాలిటీ…
తమ వార్డుపై జరుగుతున్న వివక్షకు నిరసనగా తాము క్విట్ మునిసిపాలిటీ నినాదం తీసుకొస్తామని మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకుడు మల్లిఖార్జున్ అధికారులకు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ పై నమ్మకం ఉంచి తాము మునిసిపాలిటీలో విలీనం అయ్యేందుకు ఒప్పుకుంటే అధికారులు వ్యవహరిస్తున్న తీరు తమను నైరాశ్యంలోకి నెట్టేస్తోందన్నారు. చైర్ పర్సన్ భర్త జిందం చక్రపాణితో పాటు పలువురు కౌన్సిలర్ల భర్తలు యాక్టింగ్ చేస్తున్నారని వారికి ప్రాధాన్యత ఇచ్చినందువల్లే తాను అడుగుతున్నానన్నారు. అధికారులు తమ వార్డులోకి వస్తున్నప్పుడు తాను ఎదురుగా వెళ్తున్న విషయం గమనించి కూడా కమిషనర్, సీసీ సమాచారం ఇచ్చినట్టయితే.. తన తల్లి లక్ష్మిని ముంపు ప్రాంతాల వద్దకు తీసుకెళ్లేవాడినని అన్నారు. అధికారుల తీరుపై అధికార పార్టీ నాయకులు మండిపడ్డ తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.