డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందలేదని పార్టీకి రాజీనామా.. షాక్‌లో ఎమ్మెల్యే
దిశ, మునిపల్లి : నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఒక్కరికి కూడా అందకపోవడంతో గ్రామ శాఖ అధ్యక్షులు నర్సింలు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి గ్రామశాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు లేఖ రాశారు. వివరాల్లోకి వెళ్లితే.. మండల కేంద్రమైన మునిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. కానీ అవి ఏ ఒక్కరికి అందకపోవడతో […]
దిశ, మునిపల్లి : నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఒక్కరికి కూడా అందకపోవడంతో గ్రామ శాఖ అధ్యక్షులు నర్సింలు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి గ్రామశాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు లేఖ రాశారు. వివరాల్లోకి వెళ్లితే.. మండల కేంద్రమైన మునిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. కానీ అవి ఏ ఒక్కరికి అందకపోవడతో తీవ్ర నిరాశ చెంది తాను టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి గ్రామశాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు లేఖ రాశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రావాలన్నా దురాలోచన పార్టీ నాయకులకు ఉండడం ఎంత వరకు కరెక్ట్ అనేది మండలంలో చర్చనీయాశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుంటే మునిపల్లి మండలంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి జెండా మోసిన వారికే అన్ని రావాలి అన్నట్టు ఏకధాటిగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటున్నారు. మండల కేంద్రమైన మునిపల్లిలో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిజమైన అర్హులకే దక్కే విధంగా ఉన్నత అధికారులు వారి పేర్లను సిద్ధం చేసి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మునిపల్లి టీఆర్ఎస్ పార్టీ బడా నాయకులు జీర్ణించుకోలేక ఉన్నత అధికారులతో చర్చలు జరిపి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించాలనే విధంగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.