కరోనాతో టీఆర్ఎస్ నేత మృతి.. డబ్బు ఇస్తేనే శవం అంటూ ఆసుపత్రి..
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడి కుటుంబ సభ్యులను ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం వేధింపులకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటిలోని రాంపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నిరుడు వాసుకు గత ఐదు రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో అతను కాప్రాలోని లైఫ్ లైన్ ఆసుపత్రిలో వైద్యం కోసం చేరాడు. కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల నిమిత్తం […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడి కుటుంబ సభ్యులను ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం వేధింపులకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటిలోని రాంపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నిరుడు వాసుకు గత ఐదు రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో అతను కాప్రాలోని లైఫ్ లైన్ ఆసుపత్రిలో వైద్యం కోసం చేరాడు. కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్షన్నర వరకు చెల్లించారు. చికిత్స పొందుతూ వాసు.. మంగళవారం మృతి చెందాడు.
దీంతో వాసు మృతదేహాన్ని ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరగా, మరో రూ. 2 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం బలవంతం చేసింది. ఆ రెండు లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని, లేదంటే ఇవ్వమని డాక్టర్ శ్రీనివాస్ తెగేసి చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం కాస్త మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిగొచ్చిన ఆసుపత్రి యాజమాన్యం ఎంతో కొంత డబ్బులు కట్టించుకోని బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.