నా భూమి నాకివ్వండి.. పెట్రోల్ బాటిల్‌‌తో టీఆర్ఎస్ నేత ఆందోళన

దిశ, నర్సాపూర్: తాను కౌలు చేసుకుంటున్న భూమి తనకు కేటాయించాలని కోరుతూ నర్సాపూర్ మండల పరిధిలోని మద్దూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శంకరయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం శంకరయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ఒక ఎకరం భూమిని తనకు 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. తాజాగా భూ సర్వే చేయిస్తే అధికారులు తన భూమి నుంచి 20 గుంటల భూమిని రమణ […]

Update: 2021-08-24 08:17 GMT

దిశ, నర్సాపూర్: తాను కౌలు చేసుకుంటున్న భూమి తనకు కేటాయించాలని కోరుతూ నర్సాపూర్ మండల పరిధిలోని మద్దూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శంకరయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం శంకరయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ఒక ఎకరం భూమిని తనకు 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. తాజాగా భూ సర్వే చేయిస్తే అధికారులు తన భూమి నుంచి 20 గుంటల భూమిని రమణ అనే పట్టాదారుడికి కేటాయించారని ఆరోపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని తిరిగి ఇప్పించాలని కోరుతూ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తనకు కేటాయించిన భూమిని వెంటనే చూపించాలని లేనిపక్షంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శంకరయ్య పెట్రోల్ బాటిల్‌‌ తనవెంట తీసుకొచ్చి నిరసన తెలిపారు. ఇది ఇలా ఉంటే శంకరయ్య అధికార పార్టీకి చెందినవాడు కావడం విశేషం.

Tags:    

Similar News