టీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె
దిశ, వెబ్‌డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో దృష్టిమొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలపై పెట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సోమవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నట్టు పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది.