కమలం గూటికి మరో టీఆర్ఎస్ నేత

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఎన్నికల ఫలితాల ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. జిహెచ్ఎంసీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు కారు దిగి కమలంవైపు నడిచేందుకు మొగ్గు చూపుతున్నారు. ఓటమి భయంతో కొందరైతే… టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు ఇటు నుండి అటు జంప్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో 112 వ డివిజన్ రామచంద్రాపురం టీఆర్ఎస్ తాజా మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్ కమలం కండువా కపుకున్నారు. గురువారం […]

Update: 2020-11-19 04:10 GMT

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఎన్నికల ఫలితాల ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. జిహెచ్ఎంసీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు కారు దిగి కమలంవైపు నడిచేందుకు మొగ్గు చూపుతున్నారు. ఓటమి భయంతో కొందరైతే… టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు ఇటు నుండి అటు జంప్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో 112 వ డివిజన్ రామచంద్రాపురం టీఆర్ఎస్ తాజా మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్ కమలం కండువా కపుకున్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇదే కోవలో మరికొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News