గెలుపు టీఆర్ఎస్‌దే.. ఎంసీ కోటిరెడ్డి ఘనవిజయం
దిశ ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా స్థానం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు 1271 మంది ఉండగా, 1233 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థి కుడుదుల నగేశ్‌కు 226 ఓట్లు వచ్చాయి. నిజానికి తొలి, రెండో, మూడో […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా స్థానం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు 1271 మంది ఉండగా, 1233 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థి కుడుదుల నగేశ్‌కు 226 ఓట్లు వచ్చాయి.
నిజానికి తొలి, రెండో, మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రధానంగా ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి విజయం సాధించారు. మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో గెలుపు జెండా ఎగరేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.