ఓయూ జేఏసీ కన్వీనర్ పై ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు దాడి

దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరిలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడానికి వస్తున్న పాల్వాయి నగేష్ ఓయూ జేఏసీ కన్వీనర్ పై నాగారం మండలం పస్తాల గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల దాడి చేశారు. వినతి పత్రం సమర్పించకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో జేఏసీ కన్వీనర్ నగేష్ కు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ రాజీనామా చేయాలని […]

Update: 2021-08-16 04:48 GMT

దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరిలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడానికి వస్తున్న పాల్వాయి నగేష్ ఓయూ జేఏసీ కన్వీనర్ పై నాగారం మండలం పస్తాల గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల దాడి చేశారు. వినతి పత్రం సమర్పించకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో జేఏసీ కన్వీనర్ నగేష్ కు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావాలని, తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న 20 వేల పైగా దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేయాలని కోరారు. బీసీలకు కూడా బీసీ బంధు అమలుచేయాలని, అగ్రవర్ణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. హుజురాబాద్ లో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఉన్న నాయకులకు ఎమ్మెల్సీ, చైర్మన్ నామినేటెడ్ పదవులు వచ్చాయి అలాగే తుంగతుర్తిలో ఉపఎన్నికలు వస్తే కూడా ఇవన్నీ జరుగుతాయన్నారు.

Tags:    

Similar News