కష్టాల పాలుచేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు..!
దిశ ప్రతినిధి, మెదక్ : రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిర్మిస్తున్నాం. గ్రేటర్ కమ్యూనిటీలో సైతం లేని విధంగా పైప్‌డ్ గ్యాస్ కనెక్షన్లతో ఇంటిని అందిస్తున్నామంటూ సిద్దిపేట డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలివి. సీఎం కేసీఆర్ మాటలకు సిద్దిపేట డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ వారి సంతోషం ఆరు నెలలకే పరిమితమైంది. వానాకాలంలో డబుల్ బెడ్ రూమ్ అసలు పరిస్థితి బహిర్గతమైంది. ఎడతెరిపి […]
దిశ ప్రతినిధి, మెదక్ : రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిర్మిస్తున్నాం. గ్రేటర్ కమ్యూనిటీలో సైతం లేని విధంగా పైప్‌డ్ గ్యాస్ కనెక్షన్లతో ఇంటిని అందిస్తున్నామంటూ సిద్దిపేట డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలివి. సీఎం కేసీఆర్ మాటలకు సిద్దిపేట డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ వారి సంతోషం ఆరు నెలలకే పరిమితమైంది. వానాకాలంలో డబుల్ బెడ్ రూమ్ అసలు పరిస్థితి బహిర్గతమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట పట్టణం నర్సాపూర్ శివారు కేసీఆర్ నగర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్లాబ్ పై నుండి వర్షపు నీరు ఊరుస్తుంది.
స్లాబ్ పై ఉన్న పెచ్చులు ఊడి పడటం తో కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పలు ఇండ్లలో పైపులు లీకవుతున్నాయి. మరికొన్ని ఇండ్లు తేమ వచ్చాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే వారిని సమీపంలోని ఫంక్షన్ హల్ పునరావాసం కు పంపించారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. మమ్మల్ని కాపాడేందుకు ఫంక్షన్ హల్ కు తీసుకువచ్చారు బాగానే వుంది కానీ ఇంట్లో ఉన్న సామాను పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.