ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పోలీసులను పట్టించుకోరా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే పోలీసులకు ఇబ్బందులు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలు ఉన్నాయో లేదా చూసుకోకుండా వసతి కల్పించడం విస్మయం కల్గిస్తోంది. ఎన్నికల బందోబస్తు నిర్వహించాల్సిన పోలీసులకు స్థానికంగా నిర్మిస్తున్న కొత్త భవనం కేటాయించగా, పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్న పాత భవనంలో పోలింగ్ స్టాఫ్ ఉన్నారు. దీంతో పోలీసులు కొత్తగా నిర్మిస్తున్న భవనానికి చేరుకున్న తరువాత విధుల విభజన పరిశీలించేందుకు ప్రయత్నించారు. […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే పోలీసులకు ఇబ్బందులు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలు ఉన్నాయో లేదా చూసుకోకుండా వసతి కల్పించడం విస్మయం కల్గిస్తోంది. ఎన్నికల బందోబస్తు నిర్వహించాల్సిన పోలీసులకు స్థానికంగా నిర్మిస్తున్న కొత్త భవనం కేటాయించగా, పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్న పాత భవనంలో పోలింగ్ స్టాఫ్ ఉన్నారు. దీంతో పోలీసులు కొత్తగా నిర్మిస్తున్న భవనానికి చేరుకున్న తరువాత విధుల విభజన పరిశీలించేందుకు ప్రయత్నించారు. ఈ భవనంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మొబైల్ ఫోన్ సెర్చ్ లెట్ల వెలుతురులో డ్యూటీలను విభజించుకుంటున్నారు.