అరటిపళ్లకు కరోనా లాంటి రోగం!

కొవిడ్ 19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నట్లుగానే అరటిపళ్లలో కూడా అలాంటి రోగమొకటి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ‘ట్రాపికల్ రేస్ 4 (టీఆర్4)’ అని పిలిచే ఈ డీసీజ్ అరటిపళ్లలో గత 30 ఏళ్లుగా కనిపిస్తున్నా.. దశాబ్దకాలంగానే ఇది తీవ్రతరమైనట్టు తెలుస్తోంది. దీన్ని ‘పనామా డిసీజ్’ అని కూడా పిలుస్తున్నారు. ఆసియా అరటితోటల్లో మొదట ప్రారంభమైన ఈ ఫంగస్.. నెమ్మదిగా ఆస్ట్రేలియా, మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాలతో పాటు ఇటీవల లాటిన్ అమెరికాకు కూడా వ్యాపించింది. కాగా, […]

Update: 2020-06-22 02:53 GMT

కొవిడ్ 19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నట్లుగానే అరటిపళ్లలో కూడా అలాంటి రోగమొకటి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ‘ట్రాపికల్ రేస్ 4 (టీఆర్4)’ అని పిలిచే ఈ డీసీజ్ అరటిపళ్లలో గత 30 ఏళ్లుగా కనిపిస్తున్నా.. దశాబ్దకాలంగానే ఇది తీవ్రతరమైనట్టు తెలుస్తోంది. దీన్ని ‘పనామా డిసీజ్’ అని కూడా పిలుస్తున్నారు. ఆసియా అరటితోటల్లో మొదట ప్రారంభమైన ఈ ఫంగస్.. నెమ్మదిగా ఆస్ట్రేలియా, మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాలతో పాటు ఇటీవల లాటిన్ అమెరికాకు కూడా వ్యాపించింది. కాగా, ప్రపంచానికి కావాల్సిన దాదాపు 90 శాతం అరటిని ఈ దేశాలే ఎగుమతి చేస్తుండటం గమనార్హం.

ఇప్పటికే ఈ ఫంగస్‌కు మందు కనిపెట్టడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించక పోవడంతో అరటిపళ్లకు జన్యువుల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో జన్యుమార్పిడి చేయాల్సి వస్తే ఇప్పుడు అరటిపళ్లలో ఉన్న రుచి కోల్పోవాల్సిన అవకాశముంది. అంటే ఈ పనామా డిసీజ్ కారణంగా అరటిపళ్ల సహజ రుచిని మానవాళి మర్చిపోవాల్సి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యాపార పరంగానూ ఈ జబ్బు కారణంగా తీవ్రనష్టాలు ఎదురై అరటిపళ్ల మార్కెట్ దారుణంగా పడిపోయే అవకాశం కూడా ఉందని వారంటున్నారు.

Tags:    

Similar News