బాలీవుడ్‌కు గురూజీ ఎంట్రీ?
సంక్రాంతి పండుగకు సందడి చేసిన అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్‌గా వచ్చిన అల… తెలుగు ప్రేక్షకులకు ఫుల్‌గా నచ్చేసింది. అంతే కాదు హిందీ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. సినిమా హక్కుల కోసం నిర్మాత అల్లు అరవింద్‌ను బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ చాలా మంది సంప్రదించారట. […]
సంక్రాంతి పండుగకు సందడి చేసిన అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్‌గా వచ్చిన అల… తెలుగు ప్రేక్షకులకు ఫుల్‌గా నచ్చేసింది. అంతే కాదు హిందీ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. సినిమా హక్కుల కోసం నిర్మాత అల్లు అరవింద్‌ను బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ చాలా మంది సంప్రదించారట. కానీ, వాళ్లకు ఎందుకు ఛాన్స్ ఇవ్వడం అని తానే నిర్మాతగా సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. అరవింద్‌తోపాటు హారిక అండ్ హాసిని సంస్థ అధినేత రాధాకృష్ణ చేతులు కలపగా… వీరికి తోడయ్యాడట డైరెక్టర్ త్రివిక్రమ్.
అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్టర్‌గా సినిమాపై త్రివిక్రమ్‌కు షేర్ ఉంటుంది. మూవీ ఎలాగూ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందనే నమ్మకంతో ఉన్న గురూజీ మరో నిర్మాతగా అల్లు, రాధాకృష్ణతో కలిసి పోయారట. మరి డైరెక్షన్ కూడా ఆయనే చేస్తారా? లేదా? అనేది ఇప్పటికి సస్పెన్స్. కాగా.. కొంచెం స్క్రిప్ట్ మార్పులు చేసి మల్టీస్టారర్ మూవీగా తీర్చిదిద్దితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట.