ట్రిపుల్ రైడింగ్ వెరీ డేంజర్
దిశ, గచ్చిబౌలి: యువత క్రేజీగా బైక్ రైడింగ్ చేస్తుంటారు. మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగ్‌తోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. మైనర్లు సైతం బైక్ నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు బైక్కొనిచ్చే ముందు ఒకసారి ఆలోచించాలని నిపుణులు పేర్కొంటున్నారు. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మైనార్టీ తీరకుండానే బైక్నడుపుతూ ఎంతో మంది ప్రాణాలు కొల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు. ట్రిపుల్‌రైడింగ్ చట్టరిత్యా నేరమని, పట్టుబడితే జైలు వెళ్లడం ఖాయని ట్రాఫిక్ పోలీసులు […]
దిశ, గచ్చిబౌలి: యువత క్రేజీగా బైక్ రైడింగ్ చేస్తుంటారు. మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగ్‌తోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. మైనర్లు సైతం బైక్ నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు బైక్కొనిచ్చే ముందు ఒకసారి ఆలోచించాలని నిపుణులు పేర్కొంటున్నారు. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మైనార్టీ తీరకుండానే బైక్నడుపుతూ ఎంతో మంది ప్రాణాలు కొల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు. ట్రిపుల్‌రైడింగ్ చట్టరిత్యా నేరమని, పట్టుబడితే జైలు వెళ్లడం ఖాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
బైక్ సరదా ఒక్కో సారి ప్రాణాలకే ముప్పు తెస్తుంది. మైనర్లు సైతం బైక్సవారీ చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అన్నీ తెలిసిన యువతీ యువకులు సైతం ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ట్రాఫిక్పోలీసులకు పట్టుబడిన సందర్భాలు కోకొల్లలు. మితిమీరిన వేగం, ఇద్దరు కంటే ఎక్కువ మంది బైక్‌పై ప్రయాణించడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎంతో మంది ప్రమాదాలకు గురై కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. నెల క్రితం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై యువకుడు అతి వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు నగరంలో పదుల సంఖ్యలో జరుగుతున్నట్లు ప్రమాద గణాంకాలు చెబుతున్నాయి.
లైసెన్స్ లేకుంటే బైక్ ఇవ్వొద్దు..
బైక్నడపాలనే సరదా టీనేజర్లలో ఎక్కువగా ఉంటుంది. మైనార్టీ తీరకుండానే స్కూల్ విద్యార్థులు బైక్ నడపడానికి తహతహలాడుతుంటారు. మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బైక్ఇవ్వొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి సరదా తీర్చడం కోసం తల్లిదండ్రులు బైకులు కొనుగోలుచేసి వారిని ప్రమాదాల బారిన పడేయవద్దంటున్నారు. కొందరు కుర్రకారు తల్లిదండ్రులకు తెలియకుండా బైక్ డ్రైవ్ చేస్తుంటారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
ఇద్దరి కోసమే డిజైన్ చేసిన బైక్లు..
బైక్కేవలం ఇద్దరు వ్యక్తులు కూర్చోవడానికి అనుకూలంగా ఉండేలా మాత్రమే డిజైన్ చేయబడ్డాయి. ఇద్దరు కూర్చుని డ్రైవింగ్ చేస్తూ ఉంటేనే వాహనం సాఫీగా సాగిపోతుంది. ముగ్గురు కూర్చుంటే డ్రైవింగ్ చేసే వ్యక్తికి ఇబ్బందిగాను, బైక్కంట్రోల్తప్పుతుంది. ఇద్దరు కన్నా ఎక్కువ మంది కూర్చుంటే మాట్లాడుకోవడం, జోక్ లు వేసుకోవడం చేస్తూ డ్రైవింగ్‌పై ద్యాస తప్పి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు.
తప్పని సరి అయితేనే..
ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను స్కూల్, కాలేజీలకు తీసుకెళ్లడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ట్రిపుల్ రైడింగ్ చేస్తే అది పెద్దగా తప్పేమీ కాదు. కానీ, ప్రమాదాల బారిన పడకుండా అతి జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే బాగుంటుంది. కానీ, సరదాగా ముగ్గురి కన్నా ఎక్కువ మంది డ్రైవింగ్ చేయడం నేరం. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. బైక్రేసింగ్ లను సైతం అరికట్టాలి. -రంగాచారి రిటైర్డ్ ఉద్యోగి
యువత బాధ్యతగా వ్యవహరించాలి..
డ్రైవింగ్విషయంలో యువత బాధ్యతగా వ్యవహరించాలి. సరదా కోసం ట్రిపుల్ రైడింగ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇద్దరి కంటే ఎక్కువగా బైక్‌పై ప్రయాణిస్తే అదుపు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యువత ట్రిపుల్ రైడింగ్ మానుకోవాలి. -ఆనంద్, సాఫ్ట్ వేర్ ఉద్యోగి
దొరికితే కోర్టుకే..
ట్రిపుల్ రైడింగ్ లో ఎవరు దొరికినా కేసులు పెట్టి నేరుగా కోర్టుకు తీసుకు వెళ్తున్నాం. దాంతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నాం. ట్రిపుల్ రైడింగ్ లో దొరికిన వారితో పాటు, వారి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ కు రావాల్సి ఉంటుం ది. దీంతో చాలా మంది యువకులు ట్రిపుల్ రైడింగ్ ను మానుకుంటున్నారు. రెండు మూడు సార్లు ట్రిపుల్ రైడింగ్ లో దొరికితే లైసెన్స్ రద్దు తో పాటు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. -నర్సింగరావు, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గచ్చిబౌలి