జాతీయ యువజన అవార్డ్ గ్రహీతకు సన్మానం..

దిశ, నర్సంపేట టౌన్: బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న మహ్మద్ ఆజామ్‌ను జాతీయ యువజన అవార్డు వరించింది. మానవీయ వైజ్ఞానిక శాస్త్ర ఆంగ్ల విభాగంలో, సామాజిక సేవల విభాగంలో కేంద్ర ప్రభుత్వ క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా జాతీయ యువజన అవార్డ్ ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మహ్మద్ ఆజామ్‌ను బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.యస్ హరిహరన్, […]

Update: 2021-08-25 03:24 GMT

దిశ, నర్సంపేట టౌన్: బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న మహ్మద్ ఆజామ్‌ను జాతీయ యువజన అవార్డు వరించింది. మానవీయ వైజ్ఞానిక శాస్త్ర ఆంగ్ల విభాగంలో, సామాజిక సేవల విభాగంలో కేంద్ర ప్రభుత్వ క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా జాతీయ యువజన అవార్డ్ ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మహ్మద్ ఆజామ్‌ను బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.యస్ హరిహరన్, అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ వి.నారాయణ, డాక్టర్ సంపత్, శాఖాధిపతి శ్రీనివాస్ లు శాలువ కప్పి జ్ణాపిక అందజేసి సత్కరించారు.

ఈ సందర్బంగా చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. తమ కళాశాలకు చెందిన అధ్యాపకునికి ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఆనందదాయకమని, ఆజామ్ కు గతంలో ఎన్ఎస్ఎస్ (NSS) సేవలకు జాతీయ ఉత్తమ వాలంటీర్‌గా అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఇది ఇతర అధ్యాపకులకు, విద్యార్థులకు స్పూర్తిదాయకమని చెప్తూ, ప్రతి ఒక్కరు సేవా భావాన్ని పెంపోందించుకోవాలని, దేశ సేవలో పాలు పంచుకోవాలని అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News